ఆర్థిక అసమానత లో*టక్కరి మాటలు మోడీవి"__కరాలపాటి జానీ. పల్నాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ మీడియా కోఆర్డినేటర్

ఆర్థిక అసమానత లో*టక్కరి మాటలు మోడీవి

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి మార్చి 29: పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి నగర పంచాయతీలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పలనాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ మీడియా""కోఆర్డినేటర్""కరాలపాటి జానీ మాట్లాడుతూదేశంలో ఆర్థిక అసమానతలు, పేదరికం, తగ్గుతూ వస్తుందని, ఆర్థిక వ్యవస్థ, లోపల గణనీయంగా అభివృద్ధి వైపు పయనిస్తుందని, మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మోడీ ప్రభుత్వం అబద్ధం చెబుతూ మధ్య పెట్టాలని చూస్తుంది. మోడీ ప్రభుత్వ అబద్ధాలను అనేక సంస్థల సర్వేలు, బట్ట బయలు చేశాయి. చేస్తున్నాయి కూడా! దేశంలో పెరుగుతున్న తీవ్ర, ఆర్థిక, అసమానతల గురించి ఇన్కమ్ అండ్ డెవలప్మెంట్ ఇండియా 2022 లో ఇచ్చిన నివేదికలో, ఆదాయం, సంపద, అసమాన తల పెరుగుదలను వెల్లడించింది. దేశ జనాభాలో 50 శాతం మంది తలసరి వార్షిక ఆదాయం 53610 రూపాయలు కాగా, జనాభాలో 10% శాతం ఉన్న సంపన్నుల ఆదాయం 22 శాతం ఎక్కువగా పెరిగిందని, ఒక శాతంగా ఉన్న అగ్రశ్రేణికులు, జాతీయ ఆదాయంలో ఐదు శాతం కంటే ఎక్కువగా ఉన్నారని, ఆ నివేదిక విడుదల చేయడమైనది. ప్రపంచ దేశాల్లో పేదరిక సూచిక (ఎండి పి ఐ) ను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి పోగ్రామ్, సెప్టెంబర్ 28. 20 22 నివేదికను విడుదల చేయటం జరిగింది. ఇందులో 109 దేశాల నుండి, 590 కోట్ల ప్రజల డేటాను, పరిగణలోకి తీసుకొని, ఆహారం, శిశు మరణాలు, త్రాగునీరు, గృహ వసతి, విద్య, మొదలైన 12 అంశాలను ప్రధానంగా పరిగణలోకి తీసుకొని దాని ఆధారంగా, ఆయా దేశాల బ్యాంకుల స్థాయిని నిర్ణయించగా, 109. దేశాల్లో భారతదేశం 66వ, స్థానంలో నిలిచిందని, నీతి అయోగ్, సెప్టెంబర్ 30, 20 22 న విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం జరిగింది. భారత దేశంలో 10 సంవత్సరాల మోడీ పరిపాలనలో పేదరికం, ఏ విధంగా ఉందో కళ్ళకు కట్టినట్టు చూపించింది నివేదిక.! మోడీ 10 సంవత్సరాల పాలనలో మునిపెన్నడూ లేని, విధంగాపేదరికం, ఆర్థిక అసమానతలు, స్థాయిలో ఏర్పడి ఆర్థిక అసమానతలు అత్యంత ఎక్కువగా ఉండే, దేశాల్లో భారతదేశం ఒకటని, ప్రపంచ అసమాన తల సంస్థ, అధ్యాయన0 లో వెల్లడించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది, పేదరికంలో మగ్గుతుంటే, అందులో 22.7 కోట్ల మంది భారతీయులే ఉన్నారని, వీరు కాక కరోనా బారినపడి 7.5 కోట్ల మంది పేదరికంలో కూరుకుపోయారని, మధ్యతరగతి ప్రజల్లో 3.2 కోట్ల మంది ఉన్నారని ఆ సంస్థ సర్వేలో వెల్లడించడమైనది. దేశంలో అంచనాలకు మించి, అసమానతలు విరిగిపోయాయని, వాస్తవ గణాంకాలను, గత మూడు సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తూ, ప్రజలను మోసం చేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను, ప్రైవేటు పరం చేస్తూ, జాతీయ సంపదను, కొంతమందికే పరిమితం చేస్తుందని, దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 11 కోట్ల 80 లక్షల మంది రైతులు ఉన్నారని, 14 కోట్ల 40 లక్షల 30 వేల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని, దేశంలో 90 శాతం మంది కార్మికులు"అసంఘటిత"రంగంలో పనిచేస్తున్నారని, వారందరి ఆర్థిక పరిస్థితి నిరంతరం, రోజు రోజుకి దిగజారి పోతుందని, భారతదేశంలో పేదరికానికి, తీవ్ర ఆర్థిక అసమానతలకు, మోడీ అవలంబిస్తున్న ప్రభుత్వ నిరంకుశ విధానాలే కారణమని, 68% శాతం గ్రామీణ ప్రజలకు, ఉపాధి కల్పిస్తున్న భూమి, కొద్దిమంది వ్యక్తుల వద్ద పోగై ఉండటం వల్ల, పారిశ్రామిక రంగం, పెట్టుబడి దారి వర్గం ఆధీనంలో ఉండటం వలన, సామ్రాజ్యవాదుల, బహుళ జాతి సంస్థల దోపిడీ, దారుల ఆధిపత్యం లో ఉండటం వల్ల పేదరి కానికి, ఆర్థిక అసమానతలకు కారణమైందని, పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగిపోవాలంటే గ్యారెంటీ, వారంటీ లేని మోడీ నీ, బిజెపి పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను, ఇటు పార్లమెంట్ లోను, అటు ప్రజాక్షేత్రంలోనూ , ప్రజా గొంతుకు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కి అండగా ఉంటూ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కరిగే, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి  నాయకత్వంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆదరించి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రజలను కోరుతున్నాం. 

Tags:
Views: 39

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం