టి వి వి పి ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. 👉ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కార్మికుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి. 👉పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుండి సమ్మె చేస్తాం.

సూపర్డెండెంట్ కు సమ్మె నోటీసు ఇచ్చిన ఏఐటీయూసీ కార్మిక నాయకులు.

టి వి వి పి ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి.  👉ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కార్మికుల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలి.  👉పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుండి సమ్మె చేస్తాం.

ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మార్చి 29: టి వి వి పి ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గాడ్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదు నెలలుగా జీతాలు లేక చాలీచాలని జీతాలతో కాలం వెళ్లదీస్తున్న కార్మికులకు మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లు జీతాలు సకాలంలో రాక కార్మికులు కుటుంబాల పోషణ ఎల్ల తీయలేక అవస్థలు పడుతున్నారని అన్నారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు ఒకటవ తేదీ జీతాలు చెల్లిస్తామని చెప్పి ఉన్నారని ఆ హామీని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే ఏప్రిల్ ఒకటి నుండి నిరవేదిక సమ్మె రాష్ట్రవ్యాప్తంగా చేయబోతున్నట్లు తెలిపారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెండెంట్ డాక్టర్ ముక్కెంటేశ్వరరావు కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ కార్యక్రమంలో బి కే యం యు జిల్లా సహాయ కార్యదర్శి వీశంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు వీ పద్మజ, ఏఐటీయూసీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వీశంశెట్టి విశ్వేశ్వరరావు, అన్నరపు వెంకటేశ్వర్లు, ఎస్ కె పాషా, రామకృష్ణ, కనకదుర్గా, అజయ్, నాగలక్ష్మి, పద్మ, స్వరూప, జ్యోతి, రము, దినేష్, గోపాల్, రామకృష్ణ, సుజాత, రుక్మిణీ, హుస్సేన్, సత్యవతి, హేమంత్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 6

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం