వెంకట్రాం రెడ్డికి ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితుల ఉసురు తలుగుతుంది

వెంకట్రాం రెడ్డికి పార్లమెంటు ఎన్నికల్లో డిపాజిట్ రాదు* పిసిసి కార్యదర్శి నాయని యాదగిరి

వెంకట్రాం రెడ్డికి  ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితుల  ఉసురు తలుగుతుంది

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 26: సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి  కీ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్వాసితుల  ఉసురు తగులుతుందని  పిసిసి  రాష్ట్ర కార్యదర్శి నాయిని యాదగిరి  పేర్కొన్నారు మంగళవారం ప్రజ్ఞాపూర్ లోని  నూతనంగా నిర్మిస్తున్న నల్ల పోచమ్మ దేవాలయంలో సీసీ రోడ్డు నిర్మాణ  పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్  మల్లన్న సాగర్ భూ నిర్వాసితులను  నట్టేట ముంచిన  వెంకట్రామ్ రెడ్డికి  బి ఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ ఇవ్వడం  హాస్యాస్పదంగా ఉందన్నారు.గతంలో వెంకట్రాంరెడ్డి  సిద్దిపేట జిల్లాలో   అక్రమాలకు పాల్పడ్డాడని  ఆయనకు దమ్ముంటే మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో  ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందిన కాయమన్నారు  కాంగ్రెస్ పార్టీతోనే  అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మొనగారి రాజు  పట్టణ ప్రధాన కార్యదర్శి  నక్క రాములు గౌడ్   పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు  నేత నాగరాజు  పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు  శివులు మైనార్టీ నాయకులు అజ్గర్ జానీ  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండు లక్ష్మణ్ ముట్రాజ్ పల్లి ఆంజనేయులు యాదవ్  శ్రావణ్   బిక్షపతి  సాయి రాములు  నర్సింలు దత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం