వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి

అధికారులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం, మార్చి 27 : జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అలాగే తాగునీరు వృధా కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు.  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వేసవిలో తాగునీటి అవసరాల సన్నద్ధత అంశాలపై జీవిఎంసి కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీవీఎంసి, ఆర్.డబ్యూఎస్,నీటి వనరులు,పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా లో గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, అదే ఇంకా కొనసాగు తుందని తెలిపారు. కావున నీటి సౌలభ్యాన్ని ముందే అంచనా వేసుకొని, ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేయాలన్నారు. మంచినీటి బోర్లు, మోటార్లు, పైపులు, ట్యాపులు మరామ్మతులకు గురైతే తక్షణమే మరామ్మతులు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు వృధా కాకుండా నీటి వనరులు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జీవీఎంసి కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఏలేరు, గోదావరి, గోస్తని, రాయపూడి, తాటిపూడి, మేహాద్రి గెడ్డ, గంభీరం, ముడసర్లోవ నుంచి తాగునీరు లభిస్తుందని అన్నారు. ఏలేరు నుంచి అధిక శాతం నీటిని విశాఖ సిటీ వరకు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కొన్నింటిలో నీటిసాంద్రత తక్కువగా ఉందని కలెక్టరుకు వివరించారు. ఇటువంటి పరిస్థితిల్లో ఏలేరు నుంచి మేహాద్రి గెడ్డకు పంపింగ్ ద్వారా నీటిని పంపించేలా తొలిసారి ప్రయత్నం చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి జూలై వరకు ఈ ప్రయోగం చేయడం ద్వారా రోజుకు అదనంగా 50 క్యూసెక్కుల నీటిని విశాఖ ప్రజలు వినియోగించుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ కె.వి.వి.చౌదరి, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ డి. సత్య నారాయణ, జీవిఎంసి వాటర్ సప్లై పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్ రవి, వాటర్ రీసోర్సెస్ పర్యవేక్షక ఇంజినీర్ కె. సూర్య కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఎం.వి.ఎ. శ్రీనివాసరావు,ఇతర విభాగాల ఇంజినీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం