జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాద్రి కొత్తగూడెం మార్చి 27 : వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈ ఈ , డి ఈ లు, పబ్లిక్ హెల్త్ డి ఈ లు,ఎంపీడీవోలు, ఎంపీలు, స్పెషల్ ఆఫీసర్లతో త్రాగునీరు  పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూనీటి ఎద్దటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని రాబోయే మూడు నెలల్లో గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలన్నారు. గ్రామంలో గల నీటి వసతులు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు హ్యాండ్ పంపులు, బోర్ వెల్స్,మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. బోర్లు, హ్యాండ్, పంపులు మోటార్లు,  పైపుల లీకేజీల కు అవసరమైన మరమ్మత్తులను త్వరితగతిన  పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులు ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు  తమ పరిధిలోని అన్ని నీటి సరఫరా ప్రాంతాలను ప్రతిరోజు విధిగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా  ఆదేశించారు. అవసరం ఉన్న చోట బోర్ వెల్స్ అద్దె  ప్రతిపాదికన ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీరు బల్క్ సప్లై సరిపోనియెడల సప్లై పెంచాలని మిషన్ భగీరథ అధికారులను ఆమె ఆదేశించారు.ఎస్ డి ఎఫ్ లో ప్రతిపాదించిన పనులను పురోగతిలో ఉన్నవి పూర్తి అయినవి,పూర్తి కావలసినవి, పట్టిక ద్వారా వివరాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందుగానే త్రాగునీటి సరఫరా పై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులకు ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విద్యా చందన, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 14

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.