చిన్నారులకు విద్యాసామాగ్రి అందజేసిన చెన్నా ప్రణాళిక*

ఐ ఎన్ బి టైమ్స్

చిన్నారులకు విద్యాసామాగ్రి అందజేసిన చెన్నా ప్రణాళిక*

విశాఖ సిటీ: మార్చి  న్యాయ విభాగ విద్యార్థిని "చెన్నా ప్రణాళిక జన్మదినోత్సవం" సందర్భంగా చినవాల్తేర్, రెల్లివీధిలోని బాల్వాడి స్కూల్ కేంద్రంలోని విద్యార్థులకు విద్యా సామాగ్రి, పలకలు, బలపాలు, స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా చెన్నా ప్రణాళిక మాట్లాడుతూ.. విద్య అన్నది ఏంతో విశిష్టమైనదన్నారు. కుటుంబ ప్రగతికి, దేశ అభ్యున్నతికి విద్య ఏంతో ఉపయోగపడుతుందన్నారు.  ప్రతీ ఒక్క బాల, బాలికలు తప్పనిసరిగా చదువుకోవాలన్నారు. మన తల్లితండ్రులు మన నుంచి ఆస్తులు, డబ్బు, బంగారం ఎప్పుడూ కోరుకోరని, వారు కోరుకునేది కేవలం తమ బిడ్డల అభ్యున్నతి, సమాజంలో బిడ్డలకు మంచిపేరు ప్రతిష్టలు రావడం మాత్రమేనని తెలిపారు. కాబట్టి కన్నవారి రుణం తీర్చుకోవాలంటే మనకు బాగా ఆసక్తి ఉన్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగి సమాజానికి మంచిచేస్తే చాలని, ఈ అభివృద్దే మన  తల్లితండ్రులకు, వారి కష్టానికి మనమిచ్చే అసలు సిసలైన గౌరవమని, వారి కోరికలు సంపూర్ణంగా తీర్చడమని ప్రణాళిక తెలిపారు.  చిన్నతనంలో తాను కూడా ఇదే బాల్వాడీ స్కూల్లో  ప్రప్రథమంగా పలకా బలపంతో చదువు నేర్చుకున్నానని ఈసందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రతీ ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా తన పాకెట్ మనీతో వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలను  చేస్తున్నానని తెలిపారు. తాను చదువుకుంటున్న న్యాయ విద్య కూడా ఇతరులకు సహాయపడాలనే అంశాన్ని స్పష్టంగా సూచిస్తోందని ఆమె అన్నారు. రాబోయే రోజుల్లో తాను విశిష్ట స్థానానికి ఎదిగి,  ప్రజలకు తన సేవలను విద్య, న్యాయ, సామాజిక సేవా రంగాల్లో ఉచితంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో బాల్వాడీ స్కూల్ టీచర్, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 28

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం