తొలిసారి: గాజాలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్

తొలిసారి: గాజాలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి డిమాండ్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UN security council) కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిమాండ్ చేసింది. కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇలా డిమాండ్ చేయడం తొలిసారి కావడం గమనార్హం. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ స్పష్టం చేసింది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవడం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా, ఇందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.గాజా ప్రజలు తీవ్రంగా బాధపడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతమాత్రం ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలకడమే మన బాధ్యత అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. ఇది ఇలావుంటే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికావీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే, పవిత్ర రంజాన్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగడం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరైనట్లు తెలుస్తోంది. కాగా, హమాస్‌ ఉగ్రవాదులను అంతం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటి వరుక సుమారు 32 వేల మంది మరణించినట్లు సమాచారం. అయితే, వీరిలో వేలాది మంది పౌరులు కూడా ఉన్నారు. హమాస్ ఉగ్రవాదులు మొదట ఇజ్రాయెల్ పై దాడి చేసి తమ పౌరులను హతమార్చడంతో తిరిగి భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా తమ వీటో అధికారాన్ని వినియోగించడంతో తీర్మానం వీగిపోయింది. వన్ ఇండియా తెలుగును WhatsApp పై ఫాలో అవ్వండి


Tags:
Views: 4

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.