జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్ ఎస్) స్పెషల్ క్యాంప్

జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్ ఎస్) స్పెషల్ క్యాంప్

ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ మార్చి 28: గజ్వేల్ మండల పరిధిలోని  ధర్మారెడ్డి పల్లి గ్రామంలో గజ్వేల్ ప్రభుత్వ కళాశాల   ఎన్ ఎస్ ఎస్ యూనిట్ 1  స్పెషల్ క్యాంప్  ను కళాశాల ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి   ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభ సభ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రారంభోపన్యాసం చేస్తూ,  ఎన్.ఎస్.ఎస్. శిబిరాలు నిర్వహించడం వలన  విద్యార్థులలో దేశం పట్ల సామాజిక సేవా దృక్పథం కలుగుతుందని , సమాజం పట్ల గౌరవం ఏర్పడుతుందని విద్యార్ధి దశ నుండే సేవా దృక్పథం అలవరచుకోవాలని ఆకాంక్షించారు.. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎస్. గణపతి రావు మాట్లాడుతూ ఎన్.ఎస్. ఎస్ శిబిరాలు విద్యార్థుల మధ్య  సమైక్యతను పెంపొందిస్తాయని తెలిపారు.. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం ఆఫీసర్ విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ క్యాంప్ ను వారం రోజుల పాటు నిర్వహించడం జరిగుతుందని, ఈ అవకాశాన్ని ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అద్యాపకులు రామచంద్రం,  ఓం ప్రకాశ్, రాజు, కైలాష్, సాయి క్రిష్ణ, రాజశేఖర్,  లావణ్య, ఎం.పి.టి.సి బెల్దె క్రిష్ణ, పి.ఎ.సి. ఎస్ చైర్మన్ జేజాల వెంకటేష్ గౌడ్, గ్రామ పెద్దలు సుకేందర్ రెడ్డి , గ్రామస్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 8

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం