పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిషిప్షన్ ఏర్పాట్లపై క్షేత్ర పరిశీలన : కలెక్టర్, సి పి

పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిషిప్షన్  ఏర్పాట్లపై క్షేత్ర పరిశీలన : కలెక్టర్, సి పి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మార్చి 29: రానున్న లోకసభ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలను పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి సందర్శించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్, స్ట్రాంగ్ రూంలు, రిషిప్షన్ కేంద్ర ఏర్పాట్లపై క్షేత్ర పరిశీలనలు చేశారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్ల వారిగా స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూం ల ఏర్పాట్లకు అధికారులకు సూచనలు చేశారు. క్రొత్తగా నియమిస్తున్న రెండో అంతస్తులో స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూం లు అనువుగా చూసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూంలకు కిటికీలు ఉండకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. భద్రతా, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు, ఎన్నికల నిర్వహణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. ఎండాకాలం దృష్ట్యా విద్యుత్ ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడిన ఫెన్సింగ్ ను తిరిగి ఉపయోగించాలన్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు, పోస్టల్ బ్యాలెట్ లకు గదులు సిద్ధం చేయాలన్నారు. 25 అగ్నిమాపక పరికరాలు ఇప్పటికి ఇక్కడే ఉన్నట్లు, అదనంగా కావాల్సిన వాటిఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్ లకు అలారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంపిడివో లను తమ తమ మండల పరిధిలో ఎన్నికల సంబంధ అన్ని ఏర్పాట్లపై బాధ్యత పెట్టాలన్నారు. కేంద్రీకృత రిషిప్షన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు. ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను పరిశీలించారు.  పెద్ద సమూహాన్ని హ్యాండిల్ చేసే టాస్క్ జాగ్రత్తగా చేపట్టాలన్నారు. ఇవిఎం ల రవాణా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రిషిప్షన్ కేంద్రం లో రెయిన్ ప్రూఫ్ టెంట్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఒకే భవనంలో ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కౌంటింగ్ జరగనున్నందున, ఏ సెగ్మెంట్ కు సంబంధించిన ఇవిఎం లు ఆ సెగ్మెంట్ కు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇవిఎం తరలింపు సిబ్బందికి సెగ్మెంట్ ల వారిగా కలర్ కోడ్ తో టీ షర్టులు ఇవ్వాలని, సెగ్మెంట్ల పేరు వాటిపై ప్రింట్ చేయించాలని అన్నారు. సెగ్మెంట్లకు సంబంధించి, నామ సూచికలు, బ్యానర్లు, స్టిక్కర్లు, రూట్ మ్యాప్ లు తదితర అన్నిటిపై ఆయా సెగ్మెంట్ కి కేటాయించిన రంగునే వాడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏ సెగ్మెంట్ కి వెళ్లే వారిని ఆ సెగ్మెంట్ కి వెళ్లేలా ప్రవేశం దగ్గర బాధ్యత గల అధికారిని ఉంచి, మార్గదర్శనం చేసేలా చూడాలన్నారు.  శిక్షణా కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. శిక్షణ కు సంబంధించి పిపిటి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్,  శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణ ఐపీఎస్ పి. మౌనిక, ఆర్ అండ్ బి ఎస్ఇ శ్యామ్ ప్రసాద్, ట్రాన్స్కో ఎస్ఇ సురేందర్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ శ్రీలత, రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సిహెచ్. స్వామి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 30

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.