అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు కలిసి నడుద్దాం... జూలకంటి బ్రహ్మానందరెడ్డి

అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు కలిసి నడుద్దాం... జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల మార్చి 27 : అవినీతి పరమావధిగా రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించిన వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకు కలసి ఉద్యమించాలని మాచర్ల నియోజకవర్గ టిడిపి,జనసేన,బిజెపి ఉమ్మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మాచర్ల పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి పథంలోకి నడవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని అన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని టిడిపి,బిజెపి, జనసేన కలసి పనిచేయాలని నిశ్చయించుకున్న విషయాన్ని వారికి వివరించారు. క్షేత్రస్థాయిలో  టిడిపి,బిజెపి,జనసేన కార్యకర్తలు కలిసి పనిచేయాలని కోరారు. ఏ కార్యక్రమం చేపట్టిన అందర్నీ కలుపుకొని రావాలన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలకు త్రాగునీరు, సాగునీరు,విద్య,ఆరోగ్యం,మౌలిక వసతులు, ఉద్యోగ,ఉపాధి కల్పించడమే ధ్యేయంగా కలిసి పనిచేయాలన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా గుంపు గుత్తుగా ఉమ్మడి అభ్యర్థికే పడేవిధంగా కృషి చేయాలని.అందుకు అనుగుణంగా బూత్ లెవెల్ లో కార్యకర్తలను చైతన్య పరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి కోటేశ్వరరావు,జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు,జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ యాదవ్, ఒంగోలు జిల్లా ఇంచార్జ్ రవిశంకర్,మాచర్ల బిజెపి కన్వీనర్ గుమ్మడి నాసరయ్య, శెట్టిపల్లి హనుమంతరావు,సురేష్, వెండిదండి శ్రీనివాసరావు,జనసేన నాయకులు బూస రామాంజనేయులు, నక్షత్ర ప్రసాద్,పులిహరి,తెలుగుదేశం, బిజెపి,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 1

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ  బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు...
నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు 
రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం