సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ ! com/news/india/karnataka-cm-siddaramaiah-predicted-that-hd-kumaraswamy-will-lose-in-mandya-380657.html

సీఎం హోదాలో కొడుకును గెలిపించుకోలేని వ్యక్తి ఇప్పుడు ఎలా గెలుస్తారో చూస్తాం, సీఎం చాలెంజ్ ! com/news/india/karnataka-cm-siddaramaiah-predicted-that-hd-kumaraswamy-will-lose-in-mandya-380657.html

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జేడీఎస్‌కు కర్ణాటకలోని మండ్య, హాసన్, కోలార్ నియోజకవర్గాలను బీజేపీ హైకమాండ్ ఇచ్చింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ విషయమై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మైసూరులో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామికి మండ్యలో ఓటమి ఖాయమని సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు. మండ్యలో కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు కొత్త ముఖమైతే మాజీ సీఎం కుమారస్వామి కూడా కొత్త ముఖం కాదా?, మా పార్టీ అభ్యర్థి, మాజీ సీఎం కుమారస్వామి ఇద్దరూ హాసన్‌ జిల్లాకు చెందిన వారే కాదా, ఇద్దరు మండ్యకు వలస వచ్చి పోటీ చేస్తున్నారు కదా అని సీఎం సిద్దరామయ్య జేడీఎస్ నాయకులు, బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో హెచ్‌ డీ కుమారస్వామి ఉన్న సమయంలోనే ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్యలో ఎంపీగా పోటీ చేసి ఓడిపోలేదా?, ముఖ్యమంత్రి అయ్యాక కూడా కొడుకుని గెలిపించుకోలేకపోయిన హెచ్ డీ కుమారస్వామి ఇప్పుడు మాత్రం ఎలా గెలుస్లారని సిద్దరామయ్య జేడీఎస్ నాయకులను ప్రశ్నించారు. ఇప్పుడు కూడా మండ్యలో కుమారస్వామి ఓడిపోవడం ఖాయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. కోలార్ పోటీ గురించి మాట్లాడిన సీఎం సిద్దరామయ్య కోలార్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని అన్నారు. దళితులకు బదులుగా వేరే వర్గానికి టిక్కెట్లు ఇవ్వాలనే పట్టుదల ఉందని, దీని గురించి నేను కోలారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చించానని, వాళ్లను ప్రశాంతంగా ఉండమని చెప్పానని, కోలార్ టికెట్ ఇంకా ప్రకటించలేదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. మొత్తం మీద మండ్య లోక్ సభ నియోజక వర్గంలో మాజీ సీఎం కుమారస్వామిని కచ్చితంగా ఓడిస్తామని సీఎం సిద్దరామయ్య చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.


Tags:
Views: 2

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.