యూనిఫామ్ ఇప్పించాలని సెక్యూరిటీ గార్డ్ లు వినతి పత్రం.

కాంట్రాక్టర్ ద్వారా ఉచిత యూనిఫాం ఇప్పించాలి. కర్నే రవికి వినతి పత్రం

యూనిఫామ్ ఇప్పించాలని సెక్యూరిటీ గార్డ్ లు వినతి పత్రం.

ఐ ఎన్ బి టైమ్స్ మణుగూరు మార్చి 28: గత ఇరవై సంవత్సరాలుగా సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న  మాకు కాంట్రాక్టర్ ద్వారా  ఖాకీ యూనిఫామ్ విప్పించాలని న్యాయవాది, సామజిక కార్యకర్త కర్నె రవికి వినతి పత్రం అందజేశారు. గురువారం ఉదయం మణుగూరు మండలం లోని రవి న్యాయవాది కార్యాలయం లో సింగరేణి ఏరియా నందు  ఎస్ అండ్ పీసీ డిపార్ట్మెంట్ లో గత ఇరవై సంవత్సరాలుగా సెక్యూరిటీ కాంట్రాక్టు కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నామని, యూనిఫామ్ కోసం అధికారులకు,నాయకులకు పలు మార్లు చెప్పిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.సెక్యూరిటీ టెండర్, మ్యాన్ పవర్ ఏజెన్సీ టెండర్ దక్కిన  కాంట్రాక్టర్  ద్వారా ఉచిత ఖాకీ యూనిఫాం ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ సింగరేణి సెక్యూరిటీ విభాగానికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ మురళి మ్యాన్ పవర్ ఏజెన్సీ కొత్త టెండర్ల  కాంట్రాక్టర్ తో సింగరేణి అధికారులు తో మాట్లాడి ఖాకి యూనిఫామ్ ఇప్పించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. మురళి మ్యాన్ పవర్ ఏజెన్సీ టెండర్ లో కొంతమంది సింగరేణి గార్డ్స్ ఆ కాంట్రాక్టర్ కి మాయ మాటలు చెబుతూ మా పర్మినెంట్ గార్డ్స్ తో బాటు వారికి యూనిఫామ్ ఏ విధంగా ఇస్తారు అని ఆ కాంట్రాక్టర్ కి మాయ మాటలు నేర్పుతున్నారు అని కర్నే రవి అన్నారు.  ఈ  కార్యక్రమంలో న్యాయవాది రాము, వి.శ్రీనివాస్,పి.సుదీర్,వీరబాబు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సంపత్,సతీష్,మధు,సుజిత్,రవి, కటేశ్వర రావు పాల్గొన్నారు.

Tags:
Views: 4

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.