ఖమ్మంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మహాసభలు-హాజరుకానున్న సిఎం, పలువురు రాష్ట్ర మంత్రులు

రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ

ఖమ్మంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర మహాసభలు-హాజరుకానున్న సిఎం, పలువురు రాష్ట్ర మంత్రులు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 28 : టియుడబ్ల్యూజె (ఐజెయు) మూడవ తెలంగాణ రాష్ట్ర మహాసభలు మే నెల చివరి వారంలోఖమ్మంలో జరగనున్నట్లు టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ తెలిపారు. ఈ-మహాసభలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల-నాగేశ్వరరావుతో పాటు రాష్ట్రానికి చెందిన ప్రముఖులు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలనేతలు, వివిధ వర్గాల ప్రముఖులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర-మహాసభల నిర్వహణకు సంబంధించి ప్రత్యేక సమావేశం గురువారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగింది. జిల్లా అధ్యక్షులువనం వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ మహాసభలనిర్వహణకు సంబంధించి ఖమ్మంజిల్లాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర-మహాసభలు నిర్వహించడం ఖమ్మంలో ఇది మూడోసారి అని గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రెండు సార్లు మహాసభలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మహాసభల నిర్వహణను పురస్కరించుకుని ఏప్రిల్ మొదటి -వారంలో సన్నాహాక సమావేశం నిర్వహించనున్నామని దీనికి రాష్ట్ర కమిటీ బాధ్యులు హాజరవుతారని తెలిపారు. -మహాసభలలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కుల సాధన కోసం చర్చించడం జరుగుతుందని రాంనారాయణ తెలిపారు. ఖమ్మంజిల్లా ఎన్నో ప్రజా ఉద్యమాలతో పాటు చారిత్రిక మహాసభలకు అతిథ్యమిచ్చిందని ఆయన తెలిపారు. రాష్ట్ర మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు, జర్నలిస్టులు పూర్తి సహయ సహకరాలను అందించి జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మాటేటి వేణుగోపాల్, సామినేని మురారి, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర కమిటీ బాధ్యులు ఎన్. వెంకట్రావు, ఖదీర్, టియుడబ్ల్యూజె (ఐజెయు) ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఆవుల శ్రీనివాస్, కనకం సైదులు, నాయకులు నలజాల వెంకట్రావు, శివానంద,ఎం.పాపారావు చెరుకుపల్లి శ్రీనివాస్, కూరాకుల గోపి, వై. మాధవరావు, ఎస్ కె -మోహినుద్దీన్, తాళ్లూరి మురళి, నామ పురుషోత్తం, జనార్థనాచారి, మేడి రమేష్, భవాని సింగ్, ఆలస్యం అప్పారావు, -ఏలూరి వేణుగోపాల్, కళ్యాణ్, రవికుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 20

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు. రహదారిని మూసివేసి అర్హత అటవిశాఖకు ఎక్కడిది.పరిదిదాటి ప్రవర్తించడం అటవీశాఖ అధికారులకు తగదు.
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ ఏప్రిల్ 26: పాల్వంచ నడిబొడ్డున పలు కాలనీలు బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఆసుపత్రులను కలిపే ప్రధాన రహదారిని మూసివేసే అర్హత...
మోదీ బాటే ముద్దు.. మోసగాళ్ల మాట వద్దు.
ఈవీఎం, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలు ను సందర్శించిన ఎన్నికల అధికారులు
రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి..
క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..! మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
మోడీ ప్రభుత్వం దేశం లో కార్మిక వర్గాన్ని దోచుకున్నది. ప్రభుత్వ రంగ సంస్థలు ను ప్రవేట్ పరం చేసిన ద్రోహి మోడీ.