పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం చంద్రబాబు పాలనలోనే..
ఐ ఎన్ బి టైమ్స్అమరావతి, సెప్టెంబర్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పారిశ్రామిక రంగం పునరుజ్జీవనం పోసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ పాలన అన్ని రంగాలు భ్రష్టుపట్టుకుపోయాయన్నారు. జగన్‌ను కానీ, వైసీపీ ప్రభుత్వాన్ని కానీ చూస్తే పారిపోయే పరిస్థతికి జనం వచ్చారన్నారు. యువత కూడా ఉద్యోగాలు లేక అనేక ఇబ్బందులు పడ్డారని చెప్పారు. పారిశ్రామిక రంగం అన్ని రకాలుగా ఇబ్బంది పడేది అంతా చూశారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే పారిశ్రామిక రంగానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు.ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ అఫ్ డూయింగ్ బిజినెస్‌కు అనుగుణం పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు. రాక్షస పాలన అనంతరం చంద్రబాబు రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నుకున్న రంగం పారిశ్రామిక రంగమే అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎం అయిన వెంటనే జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ పెట్టుబడి పెట్టేందుకు క్యూ కట్టాయన్నారు. దాదాపు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులతో 7.75 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగానే పాలసీ సిద్ధం చేశారన్నారు. ఈ ఐదేళ్ల పాలనలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు.కాగా.. ఏపీలో పారిశ్రామిక రంగాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించి 2014-19లో ఎన్నో పరిశ్రమలు ఏపీకి వచ్చాయి. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక.. వాళ్లందరినీ భయపెట్టి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయిన పరిస్థితి వచ్చింది. వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలకు ధైర్యం చెప్పి, భయపడాల్సిన అవసరం లేదని, మళ్లీ ఏపీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్లకు భరోసా ఇవ్వడంతో పరిశ్రమలు ఏపీకి తరలిరావడం జరుగుతోంది. అంతేకాకుండా పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్లూ కుంటుబడిన పరిశ్రమలను పరుగులు తీయించేందుకు ఐదు పారిశ్రామిక పాలసీలను తీసుకురావాలని కూడా నిశ్చయించింది.
Comment List