విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్న శ్రీరామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి     

విద్యార్థులకు బహుమతులను అందజేస్తున్న శ్రీరామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి     

          

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 27 : శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు మాచర్ల ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ ను స్థాపించి 125 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మాచర్ల పట్టణంలోని ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో భారత జాతికి నా హితవు అనే పుస్తకం ఆధారంగా విద్యార్థిని, విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహించినట్లు గోవింద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరామ కృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులకు విద్యార్థి దశ నుంచే నైతిక ఆధ్యాత్మిక విలువలు పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం జాగృతి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వివేకానంద కలలు కన్నా నవభారత నిర్మాణం జరగాలంటే విద్యార్థినీ ,విద్యార్థులు విద్యార్థులు దశ నుంచే క్రమశిక్షణ, దేశభక్తి ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలను అలవర్చుకొని, మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఆదర్శ పాఠశాల హెచ్ఎం ఝాన్సీ మేడం గారు మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా విద్యార్థులకు జాగృతి పోటీలునిర్వహించి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించే విధంగా కృషి చేయడం చాలా గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల   ఉపాధ్యాయులు చాముండేశ్వరి మేడం గారు శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు  విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:
Views: 7

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం