పేద ప్రజలకు చేరువలో వైద్య సేవలు అందించేందుకు కృషి.. జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 13:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం ,వెల్దుర్తి మండలం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందించేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని మాచల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19,46,096 విలువ కలిగిన చెక్కులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన వారు ఆర్థిక లేమితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని నాయకులు పాల్గొన్నారు.
Comment List