అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి డిసెంబర్ 14:దాచేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నడికూడి రైల్వే స్టేషన్ ఆటో యూనియన్‌తో ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ పి. భాస్కర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఎస్‌ఐ సౌందర్ రాజన్ , ఎస్‌ఐ పాపారావు మరియు ఇతర పోలీస్ సిబ్బందిపాల్గొన్నారు.సమావేశంలో ఆటో డ్రైవర్లకు మద్యం సేవించి డ్రైవింగ్ చేయకూడదని, అలాగే నిర్లక్ష్యంగా రాష్ డ్రైవింగ్ వాహనాలు నడపకూడదని స్పష్టంగా అవగాహన కల్పించారు. అలాగే, అనుమానాస్పద వ్యక్తులు గమనించినట్లయితే, వెంటనే దాచేపల్లి పోలీస్స్టేషన్‌కుసమాచారంఅందించవలసిందిగాసూచించారు.అంతేకాకుండా, ఆటో డ్రైవర్లందరూ తమ వాహనాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని పోలీసు అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం డ్రైవింగ్ నియమాలపై అవగాహన పెంచి, ప్రజల భద్రతకు సహాయపడే విధంగా ఏర్పాటు చేయబడింది.
Comment List