విజయపురి సౌత్ గ్రామపంచాయతీ చారిత్రాత్మక నిర్ణయం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ డిసెంబర్ 14 :నాగార్జునసాగర్ విజయపురిసౌత్ ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ సీఎం చంద్రబాబు గారు అధికారులకు ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం విజయపురిసౌత్ ఫిల్టర్ హౌస్ వద్ద టీడిపి సీనియర్ నేత, మాల మహానాడు సీనియర్ నాయకులు కట్ట రాయప్ప ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు గారు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.సీఎం చంద్రబాబు గారు స్థానిక ప్రజల ఎన్నో దశాబ్దాల కలయిన విజయపురిసౌత్ ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలంటూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు.ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించిన పల్నాటి పులి.. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, ఇన్చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమన్నారు.కార్యక్రమంలో స్థానిక వాసులు పగిడిపల్లి విజయ్, గొల్ల పుల్లయ్య, పత్తి రామచందర్, కట్ట అశోక్ కుమార్, పత్తి ఢిల్లీ, కొండ కోటయ్య, స్వరూప్ కుమార్ పలువురు ఉన్నారు.
Comment List