ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలం లోని మంచికల్లుగ్రామం లో గ్రామ దేవత పోలేరమ్మ తల్లి తిరుణాల ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు,మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి,పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు,జిల్లా ఎస్.పి కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వీరికి గ్రామ పెద్దలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు కుల మతాలకు అతీతంగా చేసే ఈ తిరుణాలలో వేలాది మంది భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరీకరించారు.కులమతాలకు అతీతంగా జరిగిన తిరునాళ్లమహోత్సవంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా డి.ఎస్.పి జగదీష్,కారంపూడి సి.ఐ శ్రీనివాసరావు,రెంటచింతల ఎస్.ఐ సి.హెచ్ నాగార్జున తన సిబ్బందితో ఏర్పాట్లు పర్యవేక్షించారు.భక్తులకు,నాయకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా గోగుల వెంకటరామిరెడ్డి,వారి యువత దగ్గరుండి ఏర్పాట్లను చూసుకున్నారు.
Comment List