ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:రెంటచింతల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డి ఎం హెచ్ ఓ డాక్టర్ బి.రవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్నా సిబ్బంది పని తిరును,ప్రజలకు అందిస్తున్నా వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు.డాక్టర్.ప్రదీప్ కుమార్ రెడ్డి, డాక్టర్ రమా దేవి ను డి.ఎమ్.హెచ్.ఓ డాక్టర్ బి.రవి ప్రతిరోజు వైద్యశాలకు వచ్చు ఓ.పి లను అడిగి తెలుసుకొన్నారు.ల్యాబ్ టెస్ట్ లు ఏవిధంగా నిర్వహస్తున్నారు,డెలివరీస్ కి సంభందించిన అన్ని రికార్డ్స్,హాస్పిటల్ సిబ్బంది హాజరు రికార్డులను పరిశీలించారు.పి.హెచ్సి పరిధిలోని రెంటచింతల 3,సచివాలయం లో నిర్వహిస్తున్న వాక్సిన్ పాయింట్ ను కూడా సందర్శించి అక్కడ ఎ.ఎన్.ఎమ్ రికార్డ్స్ ను,పనితీరును అడిగి తెలుసుకొన్నారు.సిబ్బంది ఎవరుకూడా వారికీ కేటాయించిన టార్గెట్స్ అన్ని 100% ఉండులాగూ చూసుకోవాలని అలా చేయనివారిపై చర్యలు తీసుకొంటాం అని హెచ్చరించారు.ఈయన వెంట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డి. హనుమకుమార్, సి హెచ్ ఓ. హర్ష,సూపర్ వైజార్స్ ఎన్. కోటేశ్వరరావు, లక్ష్మి ప్రసన్న, హెల్త్ అసిస్టెంట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comment List