దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కొత్త ఎస్‌హెచ్‌ఓ బాధ్యతలు స్వీకరించిన భాస్కర్
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు ప్రతినిధి నవంబర్ 30:దాచేపల్లి పోలీస్ స్టేషన్‌లో కొత్త ఎస్‌హెచ్‌ఓ బాధ్యతలు స్వీకరించిన భాస్కరఈ రోజు ఉదయం శ్రీ పి భాస్కర్ దాచేపల్లి పోలీస్ స్టేషన్ కొత్త స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం, మండలంలోని ట్రాఫిక్ పరిస్థితులు, సమస్యాత్మక ప్రాంతాలు, ప్రమాద ప్రదేశాలు వంటి అంశాలను సమీక్షించారు.అలాగే, సీసీటీవీ కెమెరాల స్థితి మరియు పనితీరు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల భద్రతను మెరుగుపరచడం, నేరాలు నివారించేందుకు పర్యవేక్షణను బలోపేతం చేయడం కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇది మాత్రమే కాకుండా, మండలంలో శాంతి భద్రతలు, చట్టవ్యవస్థను మెరుగుపరచడంలో భాగంగా స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆశయంగా తెలియజేశారు. ఆ ప్రాంతంలోని పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించి, స్థానిక సమస్యలపై దృష్టి సారించారు. ప్రజల సహకారంతో దాచేపల్లి మండలాన్ని మరింత భద్రంగా, ప్రశాంతంగా మార్చడంలో కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
Comment List