కారంపూడి లో నాగులేరు బ్రిడ్జి వద్ద ట్రాఫిక్ అంతరాయం పాదాచారులు ఇక్కట్లు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి డిసెంబర్ 12 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్ చెక్ పోస్ట్ సెంటర్ నుండి నాగులేరు బ్రిడ్జి వరకు నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. గురువారం పాదాచారులు మాట్లాడుతూ రహదారి చిన్నది కావడం వ్యాపారస్తులు రోడ్డు ఆనుకొని తమ షాపులను నిర్మించుకోవటం కొనుగోలు కోసం వచ్చిన వాహనదారులను రహదారిపై వాహనాలను నిలిపి వ్యాపారాన్ని కొనసాగించుకుంటున్నారు. దీంతో పాదాచారులు రహదారి పైన నడవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు . ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి రహదారుల పైన ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని పాదాచారులు కోరుతున్నారు. గతంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండేందుకు వాహనదారులు రహదారి పై ఆపకుండా నాగలేరు బ్రిడ్జి ఒడ్డున వాహనాలను నిలుపుకునేందుకు పార్కింగ్ ను ఏర్పాటు చేశారు.. చుట్టుపక్కల గ్రామ ప్రజలు తగు అవసరాల నిమిత్తం ప్రధాన పట్టణమైన కారంపూడి రావలసిన పరిస్థితి ఉంది. వ్యాపార నిమిత్తం అవసరాలకు వచ్చే వాహనదారులందరూ నాగులేరు పక్కన పార్కింగ్ ప్రదేశంలో బైకులు పార్కింగ్ చేసుకుని తమ అవసరలను తీర్చుకునేవాళ్ళు. ప్రస్తుతం నిబంధనలను పాటించకుండా వాహనదారుల తమ ఇష్టానుసారంగా ప్రధాన రహదారులపై ఆయా షాపుల వద్ద వాహనాలను నిలిపి వారి కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తుండటంతో నిత్యం ట్రాఫిక్ అంతరం ఏర్పడుతూ పెద్ద సమస్యగా మారింది. అలాంటి వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు వాపోతున్నారు
Comment List