మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి
భారతీయ సామాజిక సంస్కర్త
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 29 :భారతీయ సామాజిక సంస్కర్త. మహాత్మ జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా దళిత బహుజన భీమ్సేన. డప్పు మరియు జానపద కళాకారుల ఆధ్వర్యంలో ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలతో ఆయన కు నివాళులు అర్పించడం జరిగింది. దళిత బహుజన భీమ్సేన రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు జార్జి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంటరానితనాన్ని కుల వ్యవస్థ నిర్మూలనతోపాటు మహిళా హక్కుల కోసం కృషి చేశాడు. 1873 సంవత్సరం సెప్టెంబర్ 24న, పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కుల పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశాడు అన్నగారిని వర్గాల అభ్యున్నతి కోసంభారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకుడు ఆయన 1848 సంవత్సరంలో పూణేలొ బాలికల కోసం మొదటి పాఠశాల ఏర్పాటు చేశాడు ఆయన భార్య సావిత్రిబాయి పూలేను మహిళ విద్య వ్యాప్తి కోసం ఎంతో పోరాటం చేశారు, కారల్ మార్క్ రచించిన మానవ హక్కులనే పుస్తకానికి ప్రేరేపితై సమాజంలో ఉన్న కులాలకు కుల నిర్మాణంతో సమాజం బాగుపడుతుందని అన్నారు అదేవిధంగా ఆయన చేతిలో గులాం గిరి అనే పుస్తకం అనగా బానిసత్వము ఈ సమాజంలో అందరూ చదువుకోవాలి ప్రసిద్ధి చెందాలని ఆయన ఎంతో పోరాటం చేశారు అని అన్నారు. డప్పు మరియు జానపదం కళాకారుల రాష్ట్ర అధ్యక్షులు ఆదిరాల ఆదాము మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గారు మహిళలకు విద్యతోపాటు సమాజంలో ఉన్నటువంటి అంటరానితనాన్ని రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురువుగారిగా మహాత్మ జ్యోతిరావు పూలే గారుఅని అన్నారు. బి .ఎస్.పి పార్టీ డివిజన్ కార్యదర్శి గురజాల అప్పారావు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే మహాత్మా అనే బిరుదు రావడం జరిగింది విద్య కోసం మహిళలకు సామాజిక దురాచారాలను సతీసహగమనం ప్రోత్సహించకూడదని ఎదురు నిలబడే వాడు సమాజంలో విద్య చాలా ముఖ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో డప్పు మరో జానపదం మాచర్ల టౌన్ ప్రెసిడెంట్ మాచర్ల కాశయ్య. రాంబాబుతదితరులు పాల్గొన్నారు.
Comment List