శివ కేశవులకు ప్రీతికరమైనది కార్తీక మాసం : జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 26 :శివకేశవులకు కార్తీక మాసం ఎంతో ప్రీతికరమైనదని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. మాచర్ల పట్టణంలోని నెహ్రు నగర్ ప్రాంతంలో గల వివిఎన్ గార్డెన్స్ నందు బ్రహ్మకుమారిస్ ఓంశాంతి స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసం ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కార్తీకమాసానికి మించిన మాసం లేదని ఈ మాసంలో చేపట్టిన ఎటువంటి కార్యక్రమమైన దిగ్విజయంగా ముగిస్తారని ఆయన అన్నారు. బ్రహ్మకుమారిస్ సంస్థ గురించి సంస్థ సభ్యులను అడిగి తెలుసుకున్నారు 1937 రాజస్థాన్లో స్థాపించిన ఈ సంస్థ ప్రపంచ స్థాయి గుర్తింపు పొందటం సంతోషకరమన్నారు ఈ సమస్త చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలు మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజ ఉన్నతికి పాటుపడుతుందని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందదాయకమన్నారు. ప్రజలు భక్తి భావంతో పాటు సేవాభావాన్ని పెంపొందించుకొని తోటి వారికి సహాయ పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు పట్టణ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు మాజీ మున్సిపల్ చైర్మన్ కునిశెట్టి వెంకటేశ్వర్లు కంభంపాటి అనిల్ డాక్టర్ కమలహాసన్ రావు బ్రహ్మకుమారి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Comment List