కారంపూడి ఎడ్ల బల ప్రదర్శన లో పాల్గొన్న ఎంపీ లావుకృష్ణ దేవరాయులు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి

కారంపూడి ఎడ్ల బల ప్రదర్శన లో పాల్గొన్న ఎంపీ లావుకృష్ణ దేవరాయులు ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ డిసెంబర్ 01:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం,కారంపూడిలో వైభవంగా జరుగుతున్న పల్నాటి వీరుల మహోత్సవంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు  మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు. రెండవ రోజు వేడుకల్లో భాగం రాయబార ఘట్టం సందర్బంగా  అంకాలమ్మ,చెన్నకేశవ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి వీరుల దేవాలయంలో  స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు. కారంపూడి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.  అనంతరం జరుగుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ఎడ్ల బల ప్రదర్శన పోటీలను తిలకించారు. ఈ ఉత్సవాలు పల్నాటి వీరుల పౌరుషాలకు ప్రతీక అని అన్నారు. భగవంతుని దయతో, ప్రజల ఆశీస్సులతో కట్టబెట్టిన ఈ పదవులతో పల్నాడు ప్రజలకు మేలు చేయాలని కృషి చేస్తున్నామని, అభివృద్ధి సాధించేందుకు పాటు పడుతున్నట్లు చెప్పారు. వరికెపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేసి పల్నాడుని, సస్యశ్యామలం చేస్తామని, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందిస్తామని చెప్పారు. మంచి చేయకపోతే మనిషికి సంతృప్తి ఉండదు అని  ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.

Tags:
Views: 3

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం