సమాజ సేవకు నేను సైతం...శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 02:సీజనల్ వ్యాధుల నివారణలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే నివారణ సులభమని శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి తెలిపారు.సోమవారం మండలం లోని తూమృ కోట గ్రామంలో శ్రీకృష్ణ జనరల్ హాస్పిటల్ నేతృత్వంలో మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు.చలికాలంలో కాచిన గోరువెచ్చటి నీరును సేవించాలని,అలాగే తెల్లవారుజామున,రాత్రి సమయంలో చెవులు,ముక్కులో నోటికి క్లాత్ ధరించి ప్రయాణించాలని వ్యవసాయ రైతు కుటుంబాలు పోలాలకు వెళ్ళే సమయంలో కండువను ఉపయోగించాలని సూచించారు ధూమపానం, మద్యపానం , పొగాకు వాడకం ఆరోగ్యానికి మంచిదికాదు వీటికి దూరంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిభిరం లో 300 మంది రోగులకు ఊపిరితిత్తులు, కాలేయం, లివర్, గ్యాస్ సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే ఈసీజీ, షుగర్, యూరిన్,రక్తపరీక్షలు నిర్వహించారు కార్యక్రమంలో వైద్య సిబ్బంది,గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.
Comment List