ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసులపై డి.ఎస్.పి జగదీష్ ను కలిసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 14:
మహాజన నేత మంద కృష్ణ మాదిగ గారి ఆదేశాలు మేరకు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు ఎస్.సి, ఎస్.టి అట్రాసిటీ కేసులు గురించి శనివారం నాడు గురజాల డి.ఎస్.పి జగదీష్ ను ఎమ్.ఆర్.పి.ఎస్,ఎమ్.ఎస్.పి మాచర్ల నియోజకవర్గ ముఖ్య నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి చర్చించామని తెలిపారు.ఈ సందర్భంగా రెంటచింతల మండలంలోని జెట్టిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ ఏ.జి.ఎమ్ మరియు పి.జి.ఎమ్ ల పై ఇచ్చిన ఫిర్యాదును, రెంటచింతల గ్రామానికి చెందిన కాయితి మహేష్ రెడ్డి పై నమోదు అయిన ఎస్.సి,ఎస్.టి అట్రాసిటీ కేసు FIR NO 66/2023లో ఛార్జ్ షీట్ కోర్టుకు పంపించాలని,ఇటీవల మాచర్ల మండలంలోని తాళ్లపల్లి గ్రామ సచివాలయ ఉద్యోగుల వివాదం లో విలీజ్ సర్వేయర్ ఏసురాజు తన సోషల్ మీడియాలో పెట్టిన సెల్ఫీ వీడియోలో మాదిగల మనో భావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి నేను తెలియక చేసిన వ్యాఖ్యలు పని ఒత్తిడిలో డిప్రెషన్లో మాట్లాడిన మాటలు మాదిగసోదరులు క్షమించాలి అని సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి బహిరంగంగా కూడా క్షమించండి అని తను చేసిన తప్పునుతెలుసుకున్నసందర్భంగా,ఎమ్.ఆర్.పి.ఎస్,ఎమ్.పి,ఎమ్.ఈ.ఎఫ్ తరుపున మానవత్వంతో అతనిని క్షమించండి అని కోరగా డి.ఎస్.పి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో MSP పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గడ్డిపర్తి శ్రీనివాసరావు మాదిగ,MRPS పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కందుకూరి రమేష్ మాదిగ,జక్కరయ్య మాదిగ,తాళ్లూరి యాకోబు మాదిగ,జీవరత్నం మాదిగ,కర్ర ముసలయ్య మాదిగ,దవులూరి మరియదాస్ మాదిగ తదితరులు పాల్గొన్నారు
Comment List