మహాభారతాన్ని తలపించే ల పల్నాటి యుద్ధం - దాయాదుల పోరుతో గురజాల, మాచర్ల రాజ్యాలు

పౌరుషనికి ప్రతీక పల్నాటి కార్యమపూడి ఉత్సవాలు - రాచగావు తో ప్రారంభం కానున్న పల్నాటి వీరారాధన ఉత్సవాలు

మహాభారతాన్ని తలపించే ల పల్నాటి యుద్ధం - దాయాదుల పోరుతో గురజాల, మాచర్ల రాజ్యాలు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 29 :పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి సీమ నాటి రణ క్షేత్రమే ఒకప్పటి కార్యమపూడి నేటి కారంపూడి. యుద్ధంలోఅసురుబాసినవీరులనుస్మరించుకుంటూ జరిపే ఉత్సవాలే పల్నాటి వీరాచార ఉత్సవాలు ఇలాంటి ఉత్సవాలు ప్రపంచంలో రోమ్ దేశంలో జరపగా భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా కారంపూడి లో ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. కార్తీకపౌర్ణమి నాడు పోతురాజుకు పడిగాం కట్టి ఉత్సవాలకు అంకురార్పణ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత కార్తీక అమావాస్య రోజున ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు రాచగావు, రాయబారం, మందపోరు, కోడిపోరు, కల్లిపాడు అనే నామాలతో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి.11వ శతాబ్దంలోకారంపూడి నాగులేరు వడ్డునే గల రణభూమి లో యుద్ధం జరిగినట్లు చరిత్ర చెపుతుంది. కార్తీక అమావాస్య రోజునే పల్నాటి ఉత్సవాలు ఎందుకు ప్రారంభం అవుతాయి అంతే పల్నాటి యుద్ధ సమయంలో కార్తీక అమావాస్య నుండి ఐదు రోజుల పాటు యుద్ధం జరిగింది అని అందువలనే పల్నాటి వీరారాధన ఉత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి అని పలనాటి వీరాచారాపీఠం తెలుపుతుంది. కారంపూడి కి ఒక ఘనమైన చరిత్ర ఉంది యుద్ధంలో వీరులుగా నిలిచిన అమరులను స్మరించుకునేందుకు వీర్లదేవాలయం నిర్మించారని చరిత్ర చెపుతుంటే వీరుల ఉత్సవాల భాధ్యతను పిడుగు వంశం వారికే సాక్షాత్తు ఆ బాధ్యతలు బ్రహ్మనాయుడు ఏ అప్పగించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. మహాభారతాన్ని తలపించేదే ఈ పల్నాటి చరిత్ర ఈ యుద్దానికి అనేక కారణాలు ఉన్నాయి అనుగురాజు పాలన గురజాలను రాజ్యాంగ చేసుకోని బ్రహ్మనాయుడు ని మంత్రి వర్గంలో పాలించిన సమయంలో నాగమ్మ ఆతిధ్యం స్వీకరించి కానుకను కోరుకోవటం అనంతరం కాలంలో అనుగురాజు కొడుకు అయినా నలగమూడి పరిపాలనలో కానుకగా మంత్రి పదవిని నాగమ్మ అడగటంతో పల్నాడు చరిత్రకు అంకురార్పణ జరిగింది.అప్పటికే వైష్ణవం ద్వారా ప్రజలలో సమసమాజ స్థాపనకు బ్రహ్మన్న సుస్థిర స్థానం పొందాడు ఇదే క్రమంలో శైవమతాన్ని ప్రబోధిస్తూ నాగమ్మ పల్నాడు లో ముఖ్య స్థానం సంపాదించింది. ఈ క్రమంలో పల్నాటి రాజ్యాం రెండు ముక్కలు అయింది అలుగురాజు మొదటి భార్య సంతానమైన నలగామరాజుకు గురజాల రెండవ భార్య సంతానమైన మలిదేవులకు మాచర్ల రాజ్యాంగా పంపకాలు జరిగాయి మాచర్ల రాజ్యానికి మంత్రిగా బ్రహ్మనాయుడు గురజాల రాజ్యానికి నాయకురాలు నాగమ్మ మంత్రి గా పనిచేసింది. దాయాదుల మధ్య పోరే ఈ పల్నాటి యుద్ధం నాగమ్మ పన్నిన కుట్రలు కుతంత్రాలతో బ్రహ్మనాయుడు వనవాసం చేసినట్లు కూడా చరిత్ర చెపుతుంది కోడిపోరు తో ఓడిన మాచర్ల రాజ్యాన్ని తిరిగి మలిదేవులకు అప్పగించాలని గురజాల రాజు నలగాముని వద్దకు సంధికి వెళతాడు ఈ క్రమంలో నాగమ్మ ప్రభావంతో చల్లగుడిపాడు వద్ద సంధికి వెళ్లిన వ్యక్తి హత్యకు గురవ్వటం ఈ సంఘటన తో గురజాల, మాచర్ల రాజ్యాల మధ్య మరింత వైరం పెరిగి పల్నాటి యుద్దానికి దారితీసింది అని చరిత్ర చెపుతుంది. ఈ వీర్ల దేవాలయానికి నాటి నుండి వంశపార్యపర్యంగా పిడుగు వంశం వారే ఈ ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. యుద్ధంలో అమరులైన వీరులను ఇప్పటికి స్మరించుకోవడం గొప్ప విషయం అలనాటి యుద్ధ ఘట్టాలను కళ్ళకు కట్టినట్లు వీరచారవంతులు ఐదు రోజుల ఉత్సవాలలో ప్రదర్శిస్తారు. పల్నాటి యుద్ధంలో మరో ప్రాముఖ్యత కూడా సంతరించుకుంది రాజుల మధ్య దాయాదపోరు మంత్రుల మధ్య వైష్ణ శైవ మతల పోరు పల్నాడు యుద్దానికి అంకురార్పణగా చెప్పవచ్చు. కులమతాలకు అతీతంగా మాచర్ల రాజ్యాన్ని బ్రహ్మనాయుడు కాపాడుతుంటే కుట్రలు కుతంత్రాలతో మాచర్ల రాజ్యాన్ని వాసం చేసుకునేందుకు గురజాల రాజ్యాం ప్రయత్నిస్తుంది కులమతాలకు అతీతంగా అలనాడు బ్రహ్మనాయుడు సమసమాజ స్థాపనకు సపంతి భోజనాలను ఏర్పాటు చేయటమే కాకుండా దళితుడైన కన్నమదాసు ను దత్తపుత్రునిగా స్వీకరించి ఒక వీరునిగా తయారుచేసిన ఘనత కూడా అలనాడు బ్రహ్మనాయుడు కే దక్కాయి. ఇది జీర్ణించుకోలేని నాయకురాలు నాగమ్మ గురజాల, మాచర్ల రాజ్యాల మధ్య రాజద్వేషాలను పెంపొందించేది అని చరిత్ర చెపుతుంది. ప్రతి ఏటా రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఉన్న వీరాచారవంతులు కార్తీక అమావాస్య రోజున రణక్షేత్రమైన కార్యమపూడి చేరుకొని ఐదు రోజుల పాటు ఉత్సవాలను జరుపుకుంటారు. ఏదిఏమైనా దాయాదుల పోరు నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు  రాగద్వేషాల మధ్య జరిగిందే ఈ పల్నాటి యుద్ధం.

Tags:
Views: 38

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం