మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్

మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 12:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, మాచర్ల లో  పోలీస్ స్టేషన్ వద్ద సైకో హల్చల్ చేసాడు రెండు చేతులతో కర్రను పైకెత్తి ఏపీఎస్పీ కానిస్టేబుల్ వెంట పడిన  సైకో.భయంతో టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు పరుగులు తీసిన కానిస్టేబుల్.కాపాడిన పట్టణ పోలీసులు.సైకోను వెనుక నుండి వచ్చి నాగరాజు నాయక్ అనే హోమ్ గార్డ్ పట్టుకోవడంతో  కానిస్టేబుల్ కు తప్పిన ముప్పు రెండు రోజులుగా మాచర్లలో హల్చల్.  మాచర్ల పట్టణంలో  సైకో రెండు రోజులుగా హల్చల్ చేశాడు. మంగళవారం రాత్రి సైకో మాచర్ల పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటి తలుపులు కొట్టడంతో ఆ ప్రాంతవాసులు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు అతన్ని పట్టుకొని  బుధవారం స్టేషన్ కు తీసుకువచ్చి తిరిగి  బయటకు పంపారు.అయినప్పటికీ అతను స్టేషన్ ముందే ఉండి ఎంత చెప్పినా వెళ్ళకుండా  అక్కడే ఉంటూ ఉన్నట్టుండి రాత్రి సుమారు 10.30 గంటల సమయంలో  స్పెషల్ డ్యూటీలో ఉన్న కర్నూలు ఏపిఎస్పీ కానిస్టేబుల్ ను కొట్టేందుకు రెండుచేతులతో కర్రను పైకెత్తి వెంటపడ్డాడు..అది గమనించిన టౌన్ పోలీసులు  వెనుకనుండిపరిగెత్తుకొనివచ్చి  నాగరాజు నాయక్ అనే హోంగార్డు సైకోను గట్టిగా  పట్టుకోవడంతో ఏపీఎస్పీ కానిస్టేబుల్ కు పెద్ద  ప్రమాదం తప్పింది.ఆ సమయంలో అక్కడ ఉన్న జమ్మలమడక గ్రామప్రజలు కూడా చూసి హతాశులయ్యారు.అనంతరం సైకోను టౌన్ పోలీసులు విచారిస్తుండగ తనపేరు వెంకటరెడ్డి అని మొదట చెప్పి ఆ వెంటనే సంతోష్ అని రవితేజ అని మాట మార్చాడు. తనది నరసరావుపేటలోని బరంపేట అని,తాను మెకానిక్ పని చేస్తానని,తన అత్తామామలు మాచర్లలోనే ఉంటారని అందుకే  వచ్చానని తికమకగా పొంతన లేని సమాధానం చెప్పాడు.ఆ తర్వాత అతనికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

Tags:
Views: 113

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం