ప్రభుత్వ అధికారులు చురుకుగా గ్రామ రెవెన్యూ సదస్సు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి డిసెంబర్ 12 :ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుల కార్యక్రమం వెల్దుర్తి మండలంలోని మండాది గ్రామంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల రెవెన్యూ అధికారులు పాల్గొని మండాది గ్రామ ప్రజల భూసమస్యల్ని తెలుసుకొని కొన్ని సమస్యల్ని అక్కడికక్కడికే పరిష్కరించటం జరిగింది. అలాగే కొంతమంది గ్రామస్తులు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చారు. ఈ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో వెల్దుర్తి మండల టిడిపి మాజీ అధ్యక్షులు గుజ్జుల పాపిరెడ్డి, చంద్రారెడ్డి, వెల్దుర్తి ఎంఆర్ఓ షేక్ భాషా, మండాది విఆర్ఓ చల్లా భక్త తుకారాం మరియు రెవెన్యూ అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Views: 6
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List