ఓటరు జాబితా నవీకరణల కోసం దరఖాస్తులు
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 28:పల్నాడు జిల్లా, దుర్గి మండలం,ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషన్ వారి ఆదేశముల ప్రకారం రేపు అనగా ది: 28.11.2024న ఓటరు జాబితాలో కింది తెలిపిన చేర్పులు కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ అని తెలియజేయుచున్నాము. 0-6:కొత్త ఓటును నమోదు చేసుకోవడానికి (మొదటిసారి ఓటర్లు లేదా ఇటీవల అర్హత పొందిన వ్యక్తులు).
ఫారం-7;మరణించిన వ్యక్తులు/ డూప్లికేట్ ఎంట్రీలు / వివాహం అయిన తదుపరి వేరే ప్రాంతమునకు వెళ్ళిన వారు లేదా శాశ్వత వలసల కారణంగా ఓట్లను తొలగించుటకు.
ఫారం-8: పేరులో అక్షర దోషం సరిచేయుటకు / చిరునామాలో మార్పులు /ఓటరు జాబితాలో
వయస్సు లేదా ఇతర వివరాలు సవరణ చేయుటకు దుర్గిమండలంలోని పౌరులకు విజ్ఞప్తి. మీ ప్రాంత బూతు లెవెల్ అధికారుల వద్ద ఉన్న ఓటర్ల జాబితాలో మీయొక్క వివరాలను ధృవీకరించుకుని, ఏమైనా చేర్పులు ఉన్నా / పై తెలిపిన కారణముల వలన ఓట్లు తొలగించ వలసి యున్నా / ఓటరు జాబితాలో సవరణలు చేయవలసియున్నా దరఖాస్తులను అధికారిక ఎన్నికల కమిషన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దాఖలు చేయవచ్చు లేదా మీ ప్రాంతమునకు బూతు లెవెల్ అధికారులుగా నియమింపబడిన వారికి లేదా తహశీల్దారు వారి కార్యాలయము, దుర్గి నందు భౌతికంగా సంబంధిత ఆధారములతో రేపు అనగా ది:28.11.2024న సాయంత్రం లోపు 17సంవత్సరములు పైబడిన వారు మరియు సవరణలు కోరుతున్నవారు దరఖాస్తులను సమర్పించవలసినదిగా దుర్గి తహశీల్దారు తెలియజేడమైనది.
Comment List