స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించి 125 సంవత్సరాలు
విద్యార్థినీ విద్యార్థులకు బహుమానాలు
విద్యార్థినీ, విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి మరియు మాచర్ల శ్రీ చైతన్య స్కూల్ హెచ్ఎం హరిణి మేడం గారు. శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు మాచర్ల శ్రీ చైతన్య స్కూల్లోని విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టుగోవిందరెడ్డి తెలిపారు .స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ స్థాపించి 125 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మాచర్ల పట్టణంలోని ప్రతి స్కూలు, ప్రతి కాలేజీలో భారతజాతికి నా హితవు అనే పుస్తకం ఆధారంగా విద్యార్థిని, విద్యార్థులకు జాగృతి పోటీలు నిర్వహించినట్లు గోవిందరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు గోవింద రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి, విద్యార్థులకు విద్యార్థి దశ ఉంటే నైతిక ,ఆధ్యాత్మిక విలువలు పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరము జాగృతి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వామి వివేకానంద కలలుగన్న నవభారత నిర్మాణం జరగాలంటే విద్యార్థిని ,విద్యార్థులు విద్యార్థులు నుంచే క్రమశిక్షణ, దేశభక్తి ముఖ్యంగా స్వామి వివేకానంద భావాలను అలవర్చుకొని మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. శ్రీ చైతన్య స్కూల్ హెచ్ఎం హరిణి మేడం గారు మాట్లాడుతూ శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా విద్యార్థుల ,విద్యార్థులకు జాగృతి పోటీలునిర్వహించి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించే విధంగా కృషి చేయడం చాలా ఆనందదాయకం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ డీన్ అనిల్ గారు ,సి ఇన్చార్జి శివకుమార్ గారు ఉపాధ్యాయులు, శ్రీ రామకృష్ణ సేవా సమితి సభ్యులు ఈ శ్రీనివాస్ గారు లాల్ సాహెబ్ గారు, రవి గారు తదితరులు పాల్గొన్నారు.
Comment List