చదువులో ప్రతిభ చాటిన విద్యార్థికి పలు ట్రస్టుల ద్వారా సాయం : ఇన్చార్జ్ హెడ్ మాస్టార్ పిన్నెల్లి వెంకటేశ్వర్లు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి డిసెంబర్ 11 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం లోని కారంపూడి మండలం నందు ఉన్న బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ చాటిన కోనేటి కావ్యశ్రీ కి స్వేచ్ఛ రత్నాల ట్రస్ట్ ద్వారా రవిశంకర్ రూ. 5000, ఉల్లాస్ ట్రస్ట్ తరపున వారు రూ. 1000 సాయం అందించినట్లు బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఇంచార్జ్ హెడ్ మాస్టర్ పిన్నెల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. కారంపూడి స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై స్కూల్లో మంగళవారం పలు ట్రస్ట్ వారు ఆర్థిక సాయం అందించినట్లు ఇంచార్జ్ హెడ్ మాస్టర్ పిన్నెల్లి వెంకటేశ్వర్లు తెలిపారు . అలాగే పదిమంది విద్యార్థులకు కూడా ఉల్లాస్ ట్రస్ట్ తరఫున అందించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పిన్నెల్లి హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పలు ట్రస్టులు వారు బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుతున్న పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు పలు ట్రస్టుల ద్వారా సాయం అందించడం జరిగిందని తెలిపారు. పదవ తరగతి విద్యార్థులు బాగా చదివి జిల్లాలో మొదటి స్థానంలో ప్రతిభ చాటాలని స్కూల్లో ఉపాధ్యాయులు కోరారు
Comment List