సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం : ఎమ్మెల్యే జూలకంటి
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 25 :పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గం,దుర్గి మండల పరిధిలోని గ్రామాలను అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. సోమవారం దుర్గి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన మండల పరిషత్ సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని మాట్లాడారు. అధికారులు ప్రజా ప్రతినిధులు భేషజాలకు పోకుండా పరస్పర సహకారం సమన్వయంతో ప్రణాళికబద్ధంగా శాఖల వారీగా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని కోరారు. స్వల్పకాలిక ప్రయోజనాల కొరకు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు పనులు చేయాలని అధికారులను కోరారు. మండల పరిధిలో శాఖల వారీగా అభివృద్ధికి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
Views: 3
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List