దుర్గి మండలం లో రేపు సాగునీటి సంఘాలకు ఎన్నిక
ఐఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి డిసెంబర్ 12:పల్నాడు జిల్లా, దుర్గి మండల లో రెండు సాగునీటి సంఘాలకు, జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు మేరకు 2024 సంవత్సరం డిసెంబర్ 14న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు మండల తాహసిల్దార్ ఐ.ఫణీంద్ర కుమార్ తెలిపారు. నెమిలిగంటి చెరువు, అత్మకూరు చెరువు, ఒక్కొక్క సాగునీటి సంఘానికి ఆరు ప్రాదేశిక సభ్యులు కలవు. ఆయా సాగునీటి సంఘాల పరిధిలోని నీటి వినియోగదారసభ్యులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామ సచివాలయం నందు మరియు తహశీల్దార్ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ వారి ఇచ్చిన నీటి వినియోగదారుల సంఘముల ఎన్నికల ప్రాంగణాల జాబితాను ప్రదర్శించడమైనది. కావున, రైతులందరూ వారి యొక్క నీటి వినియోగధారుల సంఘముల ఎన్నికల ప్రాంగణాలకు తేది డిసెంబర్ 14 న విచ్చేసి, వారి యొక్క ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులను ఎన్నుకోవలసిందిగా కోరడమైనది. ఓటింగ్ లో పాల్గొనేవారు, వారి యొక్క పాస్ బుక్ జిరాక్స్ లేదా 1B మరియు ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావలసిందిగా తెలియజేయడమైనది. ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడికి, పోటీదారులుగా ఉండేందుకు వారి యొక్క పాస్ బుక్ జిరాక్స్ లేదా 1B, ఆధార్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు మరియు నీటి పన్ను మొత్తం కట్టినట్లుగా తహశీల్దార్ వద్ద నుండి రశీదు తీసుకురావలెను. నీటి పన్ను మొత్తం కట్టని రైతులు పోటీకి అనర్హులు అని తెలియజేయడమైనది.జలవనరుల శాఖ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
Comment List