శివాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే..జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 25 :మాచర్ల నియోజకవర్గం,దుర్గి మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి శివాలయ నిర్మాణానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన చేశారు. సోమవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో చేపట్టిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ గ్రామ శివాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వటం తనకు ఎంతో ఆనందకరమని ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావడం పూర్వజన్మ సుకృతం అని అన్నారు.అనంతరం గ్రామస్తులు ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే జూలకంటికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో పోలేపల్లి మాజీ సర్పంచ్ పాలువాయి బ్రహ్మారెడ్డి,గోకాని వెంకట గురవయ్య,పలసా నాసరయ్య,బడుగుల వెంకట శివ, బడుగుల శ్రీను,యలమంద,పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
Comment List