దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జరిగిన " 78వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి నవంబర్ 26:పల్నాడు జిల్లా, దుర్గి మండలం ధర్మవరం గ్రామంలోని ఎస్సీ కాలనీలో 78వ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముందుగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 2సంవత్సరాల11నెలల 18రోజులు రాజ్యాంగం వ్రాయుటకు సమయం పట్టిందని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం అని, ప్రపంచ దేశాలైన అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్టేలియా, యునైటెడ్ కింగ్ డం యొక్క రాజ్యాంగం లను పరిశీలించి, పౌర విధులు, ప్రాధమిక హక్కులు, ప్రభుత్వ పాత్ర, ఎలక్షన్ పాత్ర, మొదలైన ముఖ్యమైన విషయాలను ఇందు పొందుపరిచారని,1949 నవంబర్ 26వ తేదీన భారతప్రభుత్వం రాజ్యాంగంను ఆమోదించింది. భారతదేశం లోని అన్ని వర్గాల పౌరులందరికీ, రాజ్యాంగం లోని సర్వహక్కులను కల్పించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈయన కొందరి వాడు, కాదని అందరివాడని దళితబహుజనఫ్రంట్ పల్నాడు జిల్లా జనరల్ సెక్రటరీ వడ్డె. మధుసూదనరావు, పల్నాడు జిల్లా మహిళా కన్వీనర్ తిప్పాబత్తుల రాణి కొనియాడారు. ఈ కార్యక్రమం లో వి.వెంకట కృష్ణమ్మ, కూడల రాములమ్మ , కె.వెంకటలక్ష్మి , కూడల కోటమ్మ ,ఆరె విజయరాజు, పగిడిపల్లి సుశీల పాల్గొన్నారు.
Comment List