ముందస్తు యేసుక్రీస్తు నూతన సంవత్సర వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి నవంబర్ 29: పల్నాడు జిల్లా మాచర్ల వెల్దుర్తి మండలం యేసుక్రీస్తు లోక రక్షకుడని, సకల మానవాళి పాప విమోచనకై ప్రాణం ఇవ్వడానికే తన్నుతాను తగ్గించుకొని లోకానికి వచ్చాడని రెవరెండ్ శ్యామ్ బాబు అన్నారు. పల్నాడు దైవ సేవకుల సహవాసం ఆధ్వర్యంలో వెల్దుర్తి మండలం పాపిరెడ్డి కుంట తండా గ్రామంలో ఏర్పాటుచేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకలలో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని ప్రసంగించారు. పాస్టర్ సామ్యూల్ నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పిల్లలు సంప్రదాయ గిరిజన నృత్యాలతో దేవుని స్తుతించారు. నియోజకవర్గంలో ఉన్న పలు దైవ సేవకులు ప్రార్థనలు నిర్వహించారు.సహవాస అధ్యక్షులు జాన్ వెళ్లి మాట్లాడుతూ జ్ఞానుల వలె విలువైన హృదయం దేవునికి కానుకగా ఇవ్వాలని కోరారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి మోహన్ బాబు అధ్యక్షత వహించగా సేవకులు ప్రసాద్, శంకర్, సుందర రావు, జాషువా, సువర్ణ సుందరి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలు అందరూ సుఖ సంతోషాలతో చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
Comment List