నా ప్రాణం నిలబెట్టిన  డాక్టర్లకు ధన్యవాదాలు: పాస్టర్ మాగులూరి ప్రసాద్

మాచర్ల ప్రభుత్వ వైద్యశాలలో మహా అద్భుతం.

నా ప్రాణం నిలబెట్టిన  డాక్టర్లకు ధన్యవాదాలు: పాస్టర్ మాగులూరి ప్రసాద్

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 29 :చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చి డాక్టర్లకు ధన్యవాదాలు తెలిపారు. నా ప్రాణం నిలబెట్టిన మాచర్ల ప్రభుత్వ వైద్యశాల వైద్యులు డాక్టర్ కెపి.చారి,డాక్టర్ మురళి,డాక్టర్ సురేష్ ,హెడ్ నర్స్ సుందరి,స్టాఫ్ నర్స్,వైద్య సిబ్బందికి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మాచర్ల పట్టణంలోని 31వ వార్డుకు చెందిన పాస్టర్ మాగులూరి ప్రసాద్ అన్నారు.ఈ నెల 19వ తేదీ ఉదయం ప్రసాద్ తీవ్రమైన ఆయాసం,గుండె నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు.అప్పటికే ఆయాసం,గుండె నొప్పి ఎక్కువ కావడంతో స్పృహ కోల్పోయి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆశలు వదులుకొని వారి వారి బంధువులకు ఫోన్లు చేసి బ్రతికే ఛాన్స్ లేదని చెప్పుకోవడం జరిగింది.ఆరోజు అందుబాటులో ఉన్న బందువులు అప్పటికే పెద్దసంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే డాక్టర్లు  వెంటనే చికిత్స మొదలుపెట్టి నోట్లో పైపులు వేసి యాంబూతో ఇంటిబేటర్ చేసి తిరిగి స్పృహలోకి  తెచ్చారు.దీంతో మహా అద్భుతం జరిగినట్లయిందని  ఆయన అన్నారు.

Tags:
Views: 50

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం