యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ పెద్దాయన ఆనాడు మంచికల్లు గ్రామానికి తండ్రి లక్ష్మయ్య చేసిన అభివృద్ధి కార్యక్రమాలు,గ్రామ అభివృద్ధి,రైతుల సమస్యలను ఏ విధంగా సహాయం చేశాడు తెలియజేశారు తండ్రి యరపతినేని లక్ష్మయ్య బాటలోనే శాసనసభ్యుడిగా ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ కార్యకర్తలకు,ప్రజలకు అన్ని విధాలుగా సహాయపడుతూ వేల మందికి గుండె ఆపరేషన్లు చేపించానని వారి చిరునవ్వు తనకి ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు నియోజకవర్గానికి జూలకంటి బ్రహ్మానందరెడ్డి యరపతినేని శ్రీనివాసరావు ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు కృషి చేస్తున్నామన్నారు.గత వైకాపా ప్రభుత్వం మంచికల్లు గ్రామ అభివృద్ధిని,రైతు కుటుంబాలను అణగదొక్కి నియోజకవర్గాన్ని దోచుకోవడమే ధ్యేయంగా గత వైకాపా ప్రభుత్వం పనిచేసిందన్నారు.మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య పేద ప్రజలకు సహాయం చేయడంలో ముందుండేవారని,యరపతినేని లక్ష్మయ్య గ్రామ పెద్దాయన గా,మహోన్నతమైన వ్యక్తిగా,గొప్ప మనసు,ప్రేమా ఆప్యాయత కలగలిపి నియోజకవర్గం లో,మంచికల్లు గ్రామంలో పేరుగాంచారని తెలిపారు.
మేము రాజకీయాల్లో శాసనసభ్యులు అయినప్పటికీ జూలకంటి నాగిరెడ్డి దుర్గాంబ ల వారసుడు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అని యరపతినేని లక్ష్మయ్య వారసుడు యరపతినేని శ్రీనివాసరావు గానే పిలవబడతామని తెలిపారు.గత వైకాపా ప్రభుత్వం శాంతిభద్రతలను నిర్వీర్యం చేసిందని తెలుగుదేశం పార్టీ అధినాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని రాష్ట్రం సుభిక్షంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో యరపతినేని వెంకటేశ్వర్లు,యువనాయకులు యరపతినేని నిఖిల్,మహేష్,మట్టయ్య,గోగుల వెంకటరామిరెడ్డి,పుల్లారెడ్డి,శివయ్య,రమేష్,మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి,మాజీ ఎంపిపి గొంటు సుమంత్ రెడ్డి,బోడపాటి రామకృష్ణ,సిద్దయ్య,మూలి రాయపరెడ్డి,మూలి రాజారెడ్డి నియోజకవర్గ తెలుగుదేశం,బిజెపి,జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List