ఏసు రాజు ను వేధిస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : అశోక్ సింహ యాదవ్

ఏసు రాజు ను వేధిస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి : అశోక్ సింహ యాదవ్

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి నవంబర్ 27 :గ్రామ సచివాలయ సర్వేయర్ ఏసు రాజు పై వేధింపులకు గురిచేస్తున్న తాళ్లపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ పై తగిన చర్యలు తీసుకోవాలి.  పట్టణంలోని స్థానిక యాదవ్ సంఘ కార్యాలయంలో యాదవ్ ఉత్తాన్ సమితి భారత్  ఏపీ సంఘ జిల్లా అధ్యక్షులు మున్నా అశోక్ సింహ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాచర్ల మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామ సచివాలయంలో సర్వేయర్ గా పని చేస్తున్న కేసబోయిన ఏసు రాజు ను కులం పేరుతో దూసిస్తూ, తనపై వత్తిడికి గురిచేస్తు, ఏసు రాజు అనే పేరు పెట్టుకున్నడాని తనను చులకనగా చూస్తూ వేధిస్తున్న ఆ సెక్రటరీ పై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  ఆ సెక్రటరీ గతంలో కూడా ఒక మహిళ ఉద్యోగిపై అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయని, ఆ సచివాలయంలో పని చేస్తున్న ఉద్యోగులను అధికారులు విచారించాలని కోరారు.  యాదవులపై దాడి చేసిన, కులం పేరుతో దూషించినా సహించే ప్రసక్తేలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం ప్రత్యేక చట్టం తెస్తామని పాదయాత్రలో నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆ హామీని వీలైనంత త్వరగా బీసీల చట్టాన్ని అమలు చేయాలని కోరారు.

Tags:
Views: 37

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం