గ్రామాలలో వదలనంటున్న బెల్ట్ షాపు భూతం
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి నవంబర్ 23 :ఆంధ్రరాష్ట్రంలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మన సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం బెల్ట్ షాపులు భూతం వదలడం లేదు. బెల్లంకొండ మండలంలో రెండు మద్యం షాపులను నూతనంగా ప్రారంభించారు. మండలంలో 15 గ్రామాలలో నాగిరెడ్డిపాలెం,మాచయపాలెం గ్రామల్లో మద్యం షాపులు ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 13 గ్రామాలలో గ్రామానికి రెండు మూడు చొప్పున బెల్ట్ షాపులు అనధికారికంగా ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు లేటెస్ట్ గా ఒక చోట బెల్టు షాపును పట్టుకున్నారు. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇవి మరింత విస్తరించే అవకాశం ఎంతైనా ఉంటుందని గ్రామీణ ప్రజలు అంటున్నారు.
Tags:
Views: 39
About The Author
Related Posts
Post Comment
Latest News
యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి
15 Dec 2024 19:34:31
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
Comment List