రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ:కేటీఆర్

 రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజిన్ అంటే మోడీ+అదానీ:కేటీఆర్

ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 23:  రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్‌రెడ్డి దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే మోడీ, అదానీ అని..అందుకే వాళ్లిద్దరికి కావాల్సిన పనులను చక్కబెడుతూ వారి చల్లని చూపు తనపై ఉండేలా చూసుకుంటున్నాడని రేవంత్‌రెడ్డిపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. మూసీ పట్టే ప్రాంతం నాశనమైనా సరే కానీ... వాళ్ల బడేభాయ్‌ ఆజ్ఞను మాత్రం రేవంత్ రెడ్డి పాటిస్తారాన్నారు. ఇటు మూసీ దిగువన రామన్నపేటలో అంబుజా సిమెంట్ ప్లాంట్ కోసం బూటకపు పబ్లిక్ హియరింగ్ నిర్వహించటం ద్వారా అదానీని సంతృప్తి పరుస్తున్నారని కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.రైతును రాజును చేసింది కేసీఆర్ అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడ్డప్పుడు బియ్యం పండించడంలో తొలి 10 స్థానాల్లో లేని తెలంగాణను... ఇప్పుడు నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన నేల పచ్చబడింది, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే రాష్ట్రమూ సాధించని అరుదైన రికార్డు సాధించి, దేశానికి అన్నంపెట్టే ధాన్యాగారంగా ఎదిగిందీ అంటే దానికి కారణం కేసీఆర్ అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

 

 

 

 

 
 
Tags:
Views: 8

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి  యరపతినేని లక్ష్మయ్య విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న యరపతినేని,జూలకంటి 
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల డిసెంబర్ 15:రెంటచింతల మండలంలోనిమంచికల్లుగ్రామంలోయరపతినేనిశ్రీనివాసరావు,జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్వర్గీయ యరపతినేని లక్ష్మయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ...
ఘనంగా మంచికల్లు గ్రామదేవత పోలేరమ్మ తల్లి జాతర
గొట్టిముక్కల మేజర్ నీటి సంఘం సభ్యుడుగా నల్లపు లింగా రెడ్డి
మహిళల అవగాహన సదస్సు నిర్వహించిన మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది
అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన దాచేపల్లి పోలీస్ శాఖ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారులు..
నీటి సంఘాల ఎన్నికల ఏకగ్రీవం