మోదీ దీపావళి గిఫ్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 16 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగులు, పెన్షనర్లకు దీపావళి కానుకగా 3 శాతం కరవు భత్యాన్ని (DA) పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మూలవేతనంలో 50 శాతం ఉన్న డీఎం 53 శాతానికి చేరుతుంది. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి దీన్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.కాగా, సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చిలో డీఏను 4 శాతం కేంద్రం పెంచింది. అది జనవరి 2024 నుంచి అమల్లోకి వచ్చింది. మూడు నెలల బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఏటా ప్రభుత్వం రెండుసార్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను సవరిస్తుంటుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ కరవు భత్యాన్ని నిర్ణయిస్తారు. ఆల్ ఇండియా కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) ఆధారంగా డీఏ పెంపుదలను లెక్కిస్తారు.
Comment List