ప్రభాస్ బర్త్ డే.. చిన్ననాటి పిక్స్ షేర్ చేసిన సోదరి ప్రసీదా.
ఐ ఎన్ బి టైమ్స్ అక్టోబర్ 23:డార్లింగ్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.దీంతో సోషల్ మీడియాలో ప్రభాస్ బర్త్ డే విషెస్ ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ చెల్లెలు ప్రసీదా కూడా తన ప్రియమైన సోదరుడికి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వీరిద్దరి మధ్య ఉన్న చనువును సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అన్నయ్యతో కలిసి దిగిన తన చిన్ననాటి పిక్స్ షేర్ చేశారు.ప్రభాస్ పెద్దనాన్న హీరో కృష్ణంరాజుకు నలుగురు కూతుళ్లు. వీరందరికీ ప్రభాస్ ఒక్కడే అన్నయ్య. అందుకే అన్నయ్య అంటే చెల్లెళ్లకి కూడా ఎంతో ప్రేమ. నలుగురు సిస్టర్స్‌లో ప్రసీదా సినీ ప్రొడ్యూసర్‌గా మారారు.అలాగే, ప్రభాస్ సినిమా ఈవెంట్లలోనూ పాల్గొంటుంది. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు.నేడు ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో చిన్ననాటి ఫొటోలు షేర్ చేసి అన్నయ్యకు పుట్టిన రోజు విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి.
Comment List