డెమో రైలు ఫుట్ బోర్డుపై నుండి జారీ వ్యక్తి మృతి.
రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి వ్యక్తి మృతి
ఐఎన్ బి టైమ్స్ న్యూస్ రెంటచింతల జనవరి 19:
మాచర్ల-విజయవాడ డెమో రైలు లో ప్రయాణిస్తున్న పాత పాలువాయి గ్రామానికి చెందిన తమ్మిశెట్టి.ఏడు కొండలు అనే ప్రయాణికుడు ఫుట్ బోర్డ్ పై నుండి కాలు జారి రైలుక్రింద పడి చనిపోయిన సంఘటన ఆదివారం నాడు మండలకేంద్రమైన రెంటచింతల లో చోటుచేసుకుంది.డెమో రైలు ప్రయాణికులతో ఎప్పుడు కిక్కిరిసి పోతూవుంటుంది మాచర్ల-విజయవాడ డెమో రైలు పై ప్రయాణికుల అసౌకర్యాన్ని గుర్తిస్తూ ఎన్ని కథనాలు ప్రచురించిన డెమో రైలును మార్చి ప్యాసింజర్ రైలు నడపడంలో రైల్వే అధికారులు విఫలమయ్యారు.ఈ సంఘటన చోటు చేసుకోవడానికి డెమో రైలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయినట్లు ఉండి నిలబడటానికి కూడా చోటు లేకుండా కొంచెం లోనికి వెళ్లే క్రమంలో ఫుట్ బోర్డుపై కాలు జారి అదుపుతప్పి రైలు క్రింద పడి తమ్మిశెట్టి ఏడుకొండలు చనిపోయాడని మృతుని కుమార్తె మరియు సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపించారు.దీనిపై సమాచారం అందుకున్న నడికుడి జంక్షన్ రైల్వే ఎస్.ఐ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ తమ్మిశెట్టి ఏడుకొండలు (పాత పాలువాయి)కుమార్తె తో కలిసి గుంటూరు కు వెళ్తున్న క్రమంలో ప్రయాణికులు రద్దీగా ఉండడంతో రైలు లోనికి లగేజీ తీసుకువెళ్ళు సమయంలో కాలుజారి రైలు క్రింద పడటంతో ఏడుకొండలు అక్కడికక్కడే మృతి చెందినట్లు,శవ పంచనామా నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతునికి కుమార్తె మరియు కుమారుడు సంతానం ఉన్నట్లు,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్.ఐ వెంకట్రామయ్య తెలిపారు.
Comment List