ఘనంగా శ్రీకృష్ణ సేవాసమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జనవరి 26 :76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జండా వందనం చేసి యోగ, మెడిటేషన్ క్లాస్ లను ప్రారంభిస్తున్న ఎనుముల కేశవరెడ్డి. ఈరోజు 26 .1. 2025 ఆదివారం ఉదయం 7 గంటలకు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మాచర్ల స్వామి వివేకానంద సేవాశ్రమంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మెట్టు గోవింద రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పూజ్యులు, పెద్దలు టిడిపి సీనియర్ నాయకులు అయినటువంటి యనుమల కేశవరెడ్డి హాజరైనారు. ముందుగా ఎనుముల కేశవరెడ్డి.మెట్టు గోవిందరెడ్డి మరియు అతిధులు పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి తో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిధి ఎనుముల కేశవరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి మన దేశానికి స్వతంత్రం తెచ్చి పెట్టారని ఆ తరువాత మహానుభావుడు అయినటువంటి బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమ్ 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు మనకి అతి పెద్ద జాతీయ పండుగని సంక్రాంతి, శివరాత్రి, క్రిస్మస్, రంజాన్ కంటే కూడా ఈరోజు మన దేశ ప్రజలందరికీ పెద్ద శుభదినమని అందరూ కులా,మతా, భాష ,జాతి వర్గాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉండి ఆ మహానుభావుడు వ్రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.మరొక అతిథి పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ ఆ మహానుభావులను స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యంగా దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టిన మహాత్మా గాంధీ తదితరులను, రాజ్యాంగాన్ని వ్రాసి నటువంటి బిఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు విద్యార్థి దశ నుంచే విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా చిన్నారులకు, వృద్ధులకు అనేక సేవా కార్యక్రమాలను అందిస్తున్న మెట్టు గోవిందరెడ్డిని ఈ సందర్భంగా పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి అభినందించారు. అంతేకాకుండా తన వంతు సహాయార్థం చిన్నారులకు, వృద్ధులకు పిన్నెల్లి లక్ష్మారెడ్డి పేరు మీదుగా అనగా వారి నాన్నగారి పేరు మీద ఒక రూమ్ నిర్మాణం చేస్తానని ఈ సందర్భంగా అభయమిచ్చారు. అనంతరం ముఖ్య అతిథి ఎనుముల కేశవరెడ్డి , పిన్నెల్లి మధుసూదన్ రెడ్డి యోగా ,మెడిటేషన్ క్లాసులనుప్రారంభించారు. అనంతరం యోగా మెడిటేషన్ గురువులు తంగిరాల ఇందిరా దేవి మాట్లాడుతూ ఈ రిపబ్లిక్ దినోత్సవం రోజున నా ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్ క్లాసులకు శిక్షణను ప్రారంభించడం నాకు చాలా ఆనందాన్నిస్తుందని కావున అందరూ కూడా ప్రతిరోజు క్రమశిక్షణతో సమయపాలన పాటించి ఈ నెల రోజులపాటు ప్రతిరోజు ఉదయం 7 గంటల 8:00 వరకు శిక్షణను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ ముత్యాల పాపి రెడ్డి అందుగుల చంద్రయ్య , సంగీత ఉపాధ్యాయులు షేక్ చిన లాలు సాహెబ్ , కృష్ణవేణి ,పరిటాల ధనలక్ష్మి యోగా నేర్చుకోవడానికి వచ్చినటువంటి స్త్రీ, పురుషులు, విద్యార్థులుపాల్గొన్నారు.
About The Author
Related Posts
Post Comment
Latest News

Comment List