గణతంత్ర దినోత్సవ సందర్భంగా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
ఐన్బిటైమ్స్ బెల్లంకొండ ప్రతినిధి: మంది ప్రాణ త్యాగాల ఫలితమే మండల టిడిపి కోర్ కమిటీ సభ్యులు వెన్నా సీతారామిరెడ్డి తెలియచేశారు. మండలంలోని నాగిరెడ్డిపాలెం స్టానిక సచివాలయం వద్ద ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వసంతరావు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది పోరాట యోధులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా దైర్య,సాహస, త్యాగాల తో దాదాపు 200 సంవత్సరాలు బానిస వ్యవస్థనుండి భారతమాతకు విముక్తి కలిగించారని, మనం వారి త్యాగాలను మరువకుండా దేశ భక్తి, మాతృభక్తి భావాలతో దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని అదేవిదంగా భారత జాతికి దారి చూపిన మన రాజ్యాంగం గురుంచి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలని చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి దిశానిర్దేశం చేసే రాజ్యాంగం రూపకల్పన చేసిన మహనీయులకు మనం ఎంతో ఋణ పడివున్నామని, రాజ్యాంగ విలువలను పాటిస్తూ ముందుకు వెళ్ళాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ అయ్యప్ప, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ చైతన్య, డిజిటల్ అసిస్టెంట్ జ్యోజి రాయన్న,మహిళా పోలీస్ మహాభూబీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆశా వర్కర్లు కోటేశ్వరి గ్రామ్ పార్టీ అధ్యక్షుడు బద్దూరి వీరారెడ్డి, బద్దూరి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comment List