దుర్గి ప్రభుత్వ కార్యాలయాలలో రెప రెపలాడిన త్రివర్ణ జెండా
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది. తహసీల్దార్ కార్యలయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో యం పి డి ఓ శివప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధీర్ కుమార్ ప్రవేట్ కార్యాలయాల్లో సంభందిత ప్రధానోపాధ్యాయులు జెండాను పాఠశాలల్లో ఎగురవేసి గౌరవవందనం పొందారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకుస్వాతంత్య్రం వచ్చిందన్నారు. డా. బి ఆర్. అంబెడ్కర్ భారతీయులు ఎట్లా స్వపరిపాలన ఎలా చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారతరాజ్యాంగ నిర్మాతగా పేర్గంచారన్నారు 26జనవరి 1950నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే ) అంటారన్నారు. ఇప్పటికి 76 వ రిపబ్లిక్ డే గా మన పాలకులు జరుపుకోవడం మన అదృష్టం మన్నారు. ఈ కార్యక్రమంలో యంపి పి సునీత సాయి శంకర్ జడ్పిటిసి, ట్టిపల్లి యలమంద, సికటకంగోపాల్ఎ.పిఓ.వెంకటేశ్వర్లు, కార్యాలయాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులు, స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు.l
Comment List