రైతుల సంఘటితానికి సంఘము కేంద్ర బిందువు.. రైతు రాష్ట్ర నాయకులు వేముల విక్రమ్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ ధర్మపురి జనవరి 23 :రైతుల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన ,ఐక్యత కోసం సంఘటితం కావాలని అందుకు సంఘము కేంద్ర బిందువు అవుతుందని రైతు రాష్ట్ర నాయకులు,MLA,MP పరాజితులు వేముల విక్రమ్ రెడ్డి అన్నారు.గురువారం ధర్మపురి నియోజకవర్గం జైనా రెవెన్యూ గ్రామంలోని కోసునూర్ పల్లెలో శ్రీ వినాయక రైతు మిత్ర సంఘము(రిజిస్టర్డ్) 2025-2027పదవి కాలానికి కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సంఘానికిఅధ్యక్షులుగా ఎన్నాం నర్సింహా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముడిమడుగు శoకర్,ఉపాధ్యక్షులు ఎద్దుల భీమయ్య,కార్యదర్శిగా బుక్క మల్లేష్,కోశాధికారి గా ముడిమడుగు చెంద్రయ్య, సంయుక్త కార్యదర్శిగా అద్దరి బుచ్చిమల్లు,కార్యవర్గ సభ్యులుగా కోస్నా వెంకట్ రెడ్డి,అద్దరి కన్నయ్య,దస్తూరి నర్సయ్య,తట్ల శ్రీను,బద్ది చిన్నయ్య లు ఎన్నుకోబడ్డారు.అనంతరం వారికి తిలకం దిద్ది, పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సంఘము యొక్క ఆవశ్యకత గతంలో సంఘాల ప్రాముఖ్యత,భవిష్యత్ కార్యచరణలు వివరించారు, రైతుల ఉమ్మడి అభ్యర్ధన మేరకు గౌరవ అధ్యక్షుడు గా కొనసాగుతానని ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని.అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తానని తెలిపారు. అనంతరం ఆయనను రైతులు, కార్యవర్గo సభ్యులు పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రైతులు బద్ది గంగయ్య,అద్దరి ఎర్రయ్య,మందల సుదర్శన్ రెడ్డి,కొత్త వెంకట్ రెడ్డి,దస్తూరి రాజాం,సండ్రుగు బిమయ్య,అద్దరి రాకేష్,ఏమిరెడ్డి రాం రెడ్డి,మతులపురం అంజయ్య,బద్ది ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
Comment List